బుచ్చిరెడ్డిపాళెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం పెన్నా నది వద్ద నుంచి పుట్టమన్నును తీసుకొచ్చి నవధాన్యాలు చల్లి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ చైర్మన్ తిరువూరు అశోక్‌రెడ్డి, ఆలయ ఈఓ అర్వభూమి శ్రీనివాసులురెడ్డి, పాలక మండలి సభ్యులు, లలితా పరమేశ్వరి ఆశ్రమ పీఠాధిపతి రామాయణ మహేష్‌స్వామి పాల్గొన్నారు.
జీపీసీఎంఎస్ ఓటర్ల
జాబితా విడుదల
నెల్లూరు(వేదాయపాళెం): జూన్ 12న నిర్వహించనున్న గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘ డైరెక్టర్ల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు ఆ సంఘ చైర్మన్, డివిజనల్ మేనేజర్ ఎమ్మార్సీవీ గిరిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీడీఏ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని మండలాల్లోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ఓటర్ల జాబితాలను ప్రదర్శించామని చెప్పారు. ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈ నెల 14న ఐటీడీఏ ప్రధాన కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
ఉపాధి శ్రామికుల
సంఖ్యను పెంచండి
నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ మండలాధికారులను ఆదేశించారు. గురువారం డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలతో జూమ్‌కాన్ఫరెన్స్ ద్వారా పీడీ మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ నాటికి నిత్యం 50 వేల మంది శ్రామికులు పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. శ్రామికుల వేతన బకాయిలు మంజూరయ్యాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీల్లో అవసరమైన పనులు గుర్తించి శ్రామికులకు పనులు కల్పించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
136 బస్తాల రేషన్
బియ్యం పట్టివేత
జలదంకి(కావలి): కలిగిరి నుంచి కావలి వైపు రేషన్ బియాన్ని తరలిస్తున్న లారీని జలదంకి వద్ద కలిగిరి సీఐ సుబ్బారావు, జలదంకి ఎస్సై లతీఫున్నీసా గురువారం పట్టుకున్నారు. అనంతరం లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. లారీలో 138 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని వారు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
6 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 71,029 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,184 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూ పంలో హుండీలో రూ.3.07 కోట్లు సమర్పించా రు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగ లుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగి న భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.


