అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

డీఆర్వో విజయ్‌కుమార్‌

నెల్లూరురూరల్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌, పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో విజయ్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లో పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు మాట్లాడుతూ ఈనెల 21 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు 66 కేంద్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 28,693 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఏమైనా సందేహాలుంటే కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 0861 – 2320312కు ఫోన్‌ చేయాలన్నారు.

● డీఈఓ ఆర్‌.బాలాజీరావు మాట్లాడుతూ ఈనెల 25 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. 31 సెంటర్లలో జరిగే పరీక్షలకు 4,124 మంది హాజరవుతారన్నారు. అలాగే ఈనెల 25 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌, టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. నిర్వహణ కోసం చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇ న్విజిలేటర్లు, తనిఖీ బృందాలను నియమించామన్నారు. సమావేశంలో మున్సిపల్‌, విద్యుత్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, పోలీస్‌, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement