● యానాదిరెడ్డికి ఘన నివాళి
కావలి: మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి రాజకీయ దురంధరుడని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కలికి 20వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద ఘనంగా జరిగింది. రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలిసి యానాదిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా యానాదిరెడ్డి వర్ధంతి నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ఎంతోమంది యువకులకు రాజకీయ ఓనమాలు నేర్పి వారికి దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దామిశెట్టి సుధీర్‌నాయుడు, పందిటి కామరాజు, విజయ్‌కుమార్‌రెడ్డి, జంపాని రాఘవులు, మెట్టుకూరి రామిరెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


