గతంలో జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు డెడ్ స్టోరేజ్‌కి చేరి తాగునీరు లేని పరిస్థితులను చూశాం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు సాగునీటి భరోసా కల్పించారు. జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్ట్‌లను పూర్తి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్ తరాలకు భరోసా. అటువంటి పథకాన్ని సాధించుకునేందుకు అట్టడుగు స్థాయి నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. హక్కుల సాధన కోసం అందరూ కలిసి ఉద్యమించాలి.
–ఆనం విజయకుమార్‌రెడ్డి, నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త


