వైఎస్‌ జగన్‌ సూచనలతో ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ సూచనలతో ఆర్థిక సాయం

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

కావలి: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఓ కుటుంబానికి అండగా నిలిచారు. కావలి రూరల్‌ మండలం ఒట్టూరు గ్రామానికి చెందిన సింగోటి రాజేష్‌ అనే యువకుడు ఇటీవల బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా వైద్య ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లోకి పడిపోయింది. జువ్వలదిన్నె షిప్పింగ్‌ హార్బర్‌ సందర్శనకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి బాధిత కుటుంబం విషయం చెప్పింది. ఆయన సూచనల మేరకు ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఒట్టూరు గ్రామాల నాయకులను, రాజేష్‌ తండ్రి ప్రసాద్‌ను మంగళవారం కార్యాలయానికి పిలిపించి చికిత్స నిమిత్తం రూ.2 లక్షల నగదు అందచేశారు. ప్రసాద్‌ కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement