హోరాహోరీగా బీచ్‌ కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా బీచ్‌ కబడ్డీ పోటీలు

May 10 2026 8:22 AM | Updated on May 10 2026 8:22 AM

సంగం: మండలంలోని దువ్వూరు గ్రామంలో 13వ అంతర్‌ జిల్లాల బీచ్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలు మూడో రోజు శనివారం హోరాహోరీగా కొనసాగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన పురుష, మహిళా జట్లు తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా పోటీలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. కాగా శనివారం జరిగిన ప్రీ క్వార్టర్‌ పోటీల్లో కృష్ణా జట్టు కడప జట్టుపై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరింది. అదే విధంగా నెల్లూరు జట్టు ఎన్టీఆర్‌ జిల్లా జట్టుపై, ప్రకాశం జట్టు పశ్చిమ గోదావరిపై, శ్రీకాకుళం జట్టు ఏలూరుపై, చిత్తూరు జట్టు నంద్యాలపై, బాపట్ల జట్టు గుంటూరుపై, అనంతపురం జట్టు పల్నాడుపై, విజయనగరం జట్టు కాకినాడపై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరాయి.

Advertisement
 
Advertisement
Advertisement