మా రూట్‌.. సపరేటు | - | Sakshi
Sakshi News home page

మా రూట్‌.. సపరేటు

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

సర్వేపల్లిలో మద్యం

దుకాణాల్లో ‘ఎస్‌’ ట్యాక్స్‌ వసూలు

పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు..

అందులో ధరలు మరింత ౖపైపెకి..

ఒక్కో బాటిల్‌పై రూ.50 నుంచి రూ.80 వరకు అమ్మకాలు

పట్టించుకోని ఎకై ్సజ్‌ అధికారులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రతి అవకాశాన్ని రాబడి వనరులుగా మార్చుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనేత అండదండలతో ప్రకృతి వనరుల నుంచి.. వివిధ రంగాల వ్యాపారులనూ దోచుకుంటున్నారు. ఆఖరికి మందుబాబులనూ వదలడం లేదు. నియోజకవర్గంలో ఊరూరా బెల్టుషాపుల ఏర్పాటుకు ఏకంగా బహిరంగ వేలం పెట్టిన సదరు నేతలు, అక్కడే అధిక ధరలకు అమ్ముతున్నారనుకుంటే.. తాజాగా దుకాణాల్లోనూ ఎమ్మార్పీపై అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. అడిగితే.. ‘ఎస్‌’ ట్యాక్స్‌ కట్టాలంటూ నిర్వాహకులు చెబుతున్నారని మద్యం ప్రియులు ధ్వజమెత్తుతున్నారు. ఇక ఏకంగా మద్యం దుకాణాల పక్కనే అనధికారికంగా మినీబార్లను తలపించే రీతిలో పర్మిట్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి మరీ వ్యాపారం చేస్తున్నారు. తమ కళ్ల ముందే మద్యం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతున్నా.. ఎకై ్సజ్‌ అధికారుల కళ్లకు కనిపించకపోవడం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 28 గెజిట్‌ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇందులో వెంకటాచలంలో 6, పొదలకూరులో 6, ముత్తుకూరులో 8, మనుబోలులో 3, తోటపల్లిగూడూరు మండలంలో 5 దుకాణాలు ఉండగా, ఆయా దుకాణాల పరిధిలో విస్తృతంగా బెల్టు షాపులను ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు విపరీతంగా ఎగబడడంతో నిర్వాహకులంతా సిండికేట్‌ అయి ఒక్కో బెల్టు షాపునకు భారీ మొత్తంలో వేలం పాటలు పెట్టి మరీ అనుమతులిచ్చారు. దీంతో బెల్టుషాపులతోపాటు దుకాణాల నుంచి ‘ఎస్‌’ ట్యాక్స్‌ డిమాండ్‌ చేయడంతో ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేసి దోచుకుంటున్నారు. దుకాణాల వద్ద అయితే చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 లెక్కన వసూలు చేస్తుండగా, మిగతా బ్రాండెడ్‌ మద్యంపై రూ.50 నుంచి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎందుకు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా అమ్ముతున్నారని ప్రశ్నిస్తే క్యాషియర్లు మాత్రం నీళ్లు నములుతున్నారు.

మామూళ్ల మత్తులో ఎకై ్సజ్‌ శాఖ

సర్వేపల్లి నియోజకవర్గంలో సుమారు 250పైగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మందుబాబులను దోచుకుంటున్నారని సమాచారం. కొన్ని గ్రామాల్లో నేతల మధ్య ఉన్న పోరు కారణంగా పోటాపోటీగా బెల్టు షాపులు తెరుచుకున్నాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయాలు చేయాల్సి ఉంది. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మార్పీ ధర కంటే రూ.10 అదనంగా అమ్ముతున్నారని ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇచ్చినా మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకటాచలంలోని మద్యం దుకాణం వద్ద టీడీపీ సానుభూపతిపరులే ఎమ్మార్పీ ధర కంటే అదనంగా మద్యం అమ్మకాలు చేపట్టడంపై విమర్శలు చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మహిళలు మండి పడుతున్నారు. గ్రామాల్లో బెల్టు షాపుల గురించి ఎకై ్స జ్‌ అధికారులకు, సిబ్బందికి సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏ గ్రామం నుంచి అయితే ప్రజలు బెల్టు షాపుల గురించి సమాచారం ఇస్తున్నారో వెంటనే ఎకై ్సజ్‌శాఖ సిబ్బంది సంబంధిత బెల్టు షాపుల నిర్వాహకులకు ఫోన్‌ చేసి జాగ్రత్తగా అమ్మకాలు చేసుకోవాలని సూచిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామాల్లో బెల్టు దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. విలువైన ప్రభుత్వ భూముల్లో పాగా వేసి అక్రమ గ్రావెల్‌ దోచుకుంటున్నారు. ఏకంగా పెన్నానదిలోకి రోడ్లేసి ఇసుక కొల్లగొడుతున్నారు. బొగ్గు బూడిద రవాణా నుంచి పోర్టు నుంచి వెళ్లే సరుకుల వాహనాలు ‘ఎస్‌’ ట్యాక్స్‌ను వసూలు చేస్తుండగా తాజాగా మద్యంపైనా వసూలు చేస్తున్నట్లు మద్యం ప్రియులు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మద్యంను ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఏదొక దుకాణం వద్ద అధిక ధరల అమ్మకాలపై గొడవలు జరుగుతున్నా.. ఎకై ్సజ్‌శాఖ అధికారులు పట్టించుకోక పోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement