● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్
నెల్లూరు (లీగల్): జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న వారు ఇష్టంతో కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని, మీరు వెల్లడించే న్యాయమే అంతిమతీర్పు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల అదనపు జిల్లా న్యాయమూర్తులుగా నగరానికి బదిలీ అయిన న్యాయమూర్తులకు, ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యులకు శుక్రవారం బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. బార్ అధ్యక్షుడు పి. అయ్యప్పరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న పెళ్లకూరు కృష్ణ ప్రియాంక దేవి, దర్శి వెంకటసత్య ధనుషా, దామరమడుగు దివ్యశ్రీ, బడుగు విశ్వజాహిందులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ నలుగురు మహిళలు నెల్లూరు బార్ అసోసియేషన్ నుంచి జూనియర్స్ జడ్జిలుగా ఎంపిక కావడం గర్వ కారణమన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ కమిటీ, పలువురు న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న నలుగురిని శాలువాలు జ్ఞాపకలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎస్.అంకయ్య, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్. నాగరాజు ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్ సంయుక్త కార్యదర్శి కేఎల్‌నారాయణ కమిటీ సభ్యు లు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.


