వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు | - | Sakshi
Sakshi News home page

వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

నెల్లూరు(బృందావనం): అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సీఎంఆర్‌, చందన బ్రదర్స్‌ అధినేత మావూరి శ్రీనివాసరావు సూచనల మేరకు షాపింగ్‌మాల్లో శనివారం ‘మదర్స్‌ లవ్‌.. మై ఎక్స్‌పీరియన్స్‌’ అనే అంశంపై జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. రెండు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన చిన్నారులతో ఆదివారం వారి మాతృమూర్తులకు బహుమతులు ఇప్పించారు. ఈ పోటీల్లో 110 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన డాక్టర్‌ సువర్చల, అడ్వొకేట్‌ నర్మద మాట్లాడుతూ వ్యాసరచన పోటీలు తమ బాల్యాన్ని గుర్తు చేశాయన్నారు. కార్యక్రమంలో సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌, చందన బ్రదర్స్‌ డైరెక్టర్‌ సంతోష్‌రామ్మోహన్‌, జనరల్‌ మేనేజర్‌ వాసు, స్టోర్‌ మేనేజర్‌ కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిమ్మ ధరలు(కిలో)

పెద్దవి: రూ. 120

సన్నవి: రూ. 32

పండ్లు: రూ. 20

Advertisement
 
Advertisement
Advertisement