ముగిసిన బీచ్‌ కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన బీచ్‌ కబడ్డీ పోటీలు

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

సంగం: మండలంలోని దువ్వూరులో నిర్వహిస్తున్న 13వ అంతర్‌ జిల్లాల బీచ్‌ కబడ్డీ పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా ముగిశాయి. మహిళా విభాగంలో శ్రీకాకుళం జట్టుపై విజయనగరం విజేతగా నిలిచింది. మూడు, నాలుగు స్థానాల్లో నెల్లూరు, బాపట్ల జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో బాపట్ల జట్టు నెల్లూరుపై విజయం సాధించింది. మూడు, నాలుగు స్థానాల్లో పల్నాడు, కృష్ణా జట్లు నిలిచాయి. విజేతలకు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బహుమతులు అందజేశారు. భారీ సంఖ్యలో అభిమానులు, స్థానిక ప్రజలు తరలివచ్చి పోటీలను తిలకించారు.

Advertisement
 
Advertisement
Advertisement