నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఈనెల 9, 10వ తేదీల్లో నెల్లూరులో ఆవాజ్ మూడో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని జిల్లా కార్యదర్శి రషీద్ తెలిపారు. నెల్లూరులోని ఆవాజ్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9వ తేదీ ఉదయం భారత రాజ్యాంగం – లౌకికవాదం ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు, ఆవాజ్ వ్యవస్థాపకులు గఫూర్ తదితరులు హాజరవుతారన్నారు. మతసామరస్యానికి, లౌకికత్వానికి ప్రతీక అయిన జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న సభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రఫీ, నాయకులు జానీబాషా, చాన్‌బాషా, కోశాధికారి సర్దార్ అహ్మద్, జిల్లా కమిటీ సభ్యులు నాయబ్ రసూల్, ఫయాజ్, రవూఫ్, మునీర్ అహ్మద్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.


