రెండు మోటార్‌బైక్‌ల ఢీ | - | Sakshi
Sakshi News home page

రెండు మోటార్‌బైక్‌ల ఢీ

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

వృద్ధుడి మృతి ముగ్గురికి తీవ్రగాయాలు

సంగం: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతిచెందగా ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కొరిమెర్ల వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. లింగసముద్రం మండలానికి చెందిన వట్టిగుంట రమణయ్య (70) చేజర్ల మండలం ఆదూరుపల్లి చవటపల్లిలో ఉంటున్న తన కుమార్తె వద్దకు మామిడిపండ్లు తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అలాగే కలిగిరి మండలంలో జరిగే హనుమాన్‌ జయంతి కార్యక్రమానికి నెల్లూరు నుంచి ముగ్గురు యువకులు బైక్‌పై బయలుదేరాడు. రెండు వాహనాలు కొరిమెర్ల వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రమణయ్యతోపాటు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రమణయ్యను 108లో ఆత్మకూరుకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. బుధవారం పోస్టుమార్టం అనంతరం రమణయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఎస్సై రాజేష్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement