నెల్లూరు (టౌన్): అంతర్జాతీయ కరాటే పోటీల్లో నెల్లూరు క్రీడాకారులు పలు పతకాలతో సత్తా చాటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఒకినావన్ కరాటే కోబుడో అసోసియేషన్ ఇంటర్నేషనల్ లీగ్–4 చాంపియన్‌షిప్ 2026 పోటీల్లో వివిధ విభాగాల్లో పలు పతకాలు సాధించి అంతర్జాతీయ వేదికపై తెలుగుజెండాను రెపరెపలాడించారు. కరాటే పోటీల్లో సుశ్రూష నందన, సుశ్మేత, కృష్ణ, నిధిజైన్, దియా అక్తర్, విన్సీ మేధిత, జీవ దర్శిని, హనీష్ శంకర్, లేయాన్, ప్రణయ్, సుశ్వంత్, గురుచరణ్, వినీల్ (బంగారు పతకాలు), లహరి, గుణ విచ్యాత్, మౌనిష్, జైసన్నిత్, హనీష్ (సిల్వర్ పతకాలు), తనివ్హా, పవన్ (కాంస్య పతకాలు) సాధించారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ మార్షలార్ట్స్ గురువు, అంతర్జాతీయ బ్లాక్‌బెల్ట్ ఆరో డాన్, షిఫూ మాస్టర్ ప్రభాకర్‌రెడ్డి సారథ్యంలో వీరు పతకాలు సాధించారు. ఆయన ఇప్పటికే 37 గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించి దేశంలోనే అరుదైన ఘనతను అందుకున్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు.
బంగారు పతకాలను చూపిస్తున్న
నెల్లూరు క్రీడాకారులు


