ఇదే వ్యవహారంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఆగమేఘాల మీద నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతి, మరో ముగ్గురిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ప్రసన్నకుమార్‌రెడ్డిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరుకు వస్తే.. వైఎస్సార్‌సీపీ నేతలకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఓ హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేశారంటూ ప్రసన్నతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల పైనా కేసులు నమోదు చేశారు.
ప్రసన్న ఇంటిపై దాడి..
జిల్లాలో ఖాకీల వ్యవహార తీరు పరాకాష్టకు చేరింది. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించని నాలుగో సింహమే ఈ పోలీస్.. అని గొప్పగా అభివర్ణించే స్థాయి నుంచి ఖాకీల ప్రతిష్ట మంట గలుస్తోంది. రాజ్యాంగబద్ధమైన కొలువుల్లో ఉంటూ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కొందరు ఖాకీలు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, జర్నలిస్టులు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు, వేధింపులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఎస్సై వైఎస్సార్‌సీపీ నాయకుడిని సెల్‌లో పెట్టి కొడుతూ ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా టీడీపీ నేతలకు చూపించిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలు రాజకీయాలకు బానిసలవుతున్నారన్న విమర్శలు మరింతగా బలపడుతున్నాయి.
సాక్షిప్రతినిధి నెల్లూరు: జిల్లాలో కొందరు ఖాకీలు అధికార పార్టీ నేతల కిరాయి రౌడీల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలతోపాటు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే.. అధికారిక అరాచక శక్తుల్లా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఓ వైపు శాంతిభద్రతలు రోజు రోజకు క్షీణించిపోతున్నాయి. మరో వైపు అధికార పార్టీ నేతల ఇసుక, గ్రావెల్, మద్యం అక్రమ రవాణా, వ్యాపారాలు విచ్చలవిడిగా జరుగుతున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో పోస్టింగ్‌లు దక్కించుకున్న కొందరు ఖాకీలు తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. శాంతి భద్రతల కంటే అధికార పార్టీ నేతల ఆదేశాలే ప్రామాణికాలుగా, రెడ్‌బుక్ రాజ్యాంగమే గీటురాయి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పచ్చ నేతల మెప్పు పొందేందుకు అడ్డగోలుగా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకులను అక్రమ కేసులతో అణిచివేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులపై అధికార పార్టీ నేతలు, వారి కిరాయి మూకలు సాగించే దాష్టీ కాలపై నోరు మెదపకపోగా తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారు.
శంకరనగరం నుంచి నావూరుపల్లి వరకు..
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. టీడీపీ నేతల అరాచకాలకు హద్దు లేకుండా పోయింది. వీరి అరాచకాలను అడ్డుకోవాల్సిన పోలీసులు ఆ నాటి నుంచి ఈ రోజు వరకు పచ్చ నేతలకు ఊడిగం చేయడంలో తలమునకలవుతున్నారు. అనంతసాగరం మండలం శంకరనగరం నుంచి.. పొదలకూరు మండలం నావూరుపల్లి వరకు పోలీసుల వ్యవహార తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. రెండేళ్లుగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నుంచి మాజీ మంత్రి వరకు కేసుల పరంపర కొనసాగుతోంది. శంకరనగరంలో వైఎస్సార్‌సీపీ నేత, అప్పటి సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై మారణాయుధాలతో తెగబడ్డారు. వారి ఇళ్లలోకి చొరబడి టీవీలు, ఫ్రిజ్‌లు ధ్వంసం చేశారు. సర్పంచ్‌తోపాటు ఆమె ఇంటి పక్కనే ఉంటున్న రవికుమార్‌రెడ్డి, నాగసునీల్‌రెడ్డి, రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు. చదువుకునే విద్యార్థులు, వృద్ధులపై రౌడీషీట్లు తెరిచి ఖాకీలు పచ్చ పైత్యం ప్రదర్శించారు.
కాకాణిపై కేసుల పరంపర
రాజకీయ విమర్శల నేపథ్యంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై వందలాది మంది టీడీపీ ముష్కర మూకలు దాడి చేస్తుండగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముష్కరుల్లో కొందరు వెళ్లిపోగా కొందరు నింపాదిగా నడుచుకుంటూ వెళ్లారు. పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉన్నప్పటికి మిన్నకుండిపోయారన్న విమర్శలున్నాయి. సదరు ఘటనపై నామమాత్రంగా కేసు నమోదు చేసి కొందరికి నోటీసులు జారీతో సరిపెట్టారు.
కొడుతూ.. వీడియో కాల్ చేసి చూపిస్తూ..
జిల్లాలోని పొదలకూరు ఎస్సై హనీఫ్ పోలీస్ ప్రతిష్టను నడిబజారులో పచ్చ పార్టీకి తాకట్టు పెట్టాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతను తమ కాళ్ల దగ్గరకు తీసుకురావాలని టీడీపీ నేతలు ఆదేశించడంతో జీ.. హుజూర్ అంటూ ఎస్సై అతనిపై ఖాకీల బలం చూపించి బలవంతంగా అభ్యంతరకరంగా లాక్కెళ్లి సెల్‌లో పెట్టి లాఠీలతో కొడుతూ.. ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా టీడీపీ నేతలకు చూపించాడు. అధికార పార్టీ నేతల మెప్పు కోసం.. సదరు పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారింది. ఈ ఘటన ఖాకీల పచ్చ కావరానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఎస్సై తీరుపై ప్రజల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పొదలకూరు పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు బైఠాయించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేతలు చెప్పిందే వేదంగా పోలీసుల వ్యవహారం
శంకరనగరం నుంచి నావూరుపల్లి వరకు వీరి తీరు వివాదాస్పదం
రెండేళ్లుగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వరకు కేసుల పరంపర
తాజాగా టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి వైఎస్సార్‌సీపీ నేతను కొట్టిన ఎస్‌ఐ
ఇక నిత్యం టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టుతూ.. సర్వేపల్లి ఎమ్మెల్యే అక్రమాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తుండడంతో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చినా ఆయనపై అక్రమ కేసులు పరంపర కొనసాగుతూనే ఉంది. కోవూరులో ఓ మైనర్ బాలిక మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నీచపు రాతలను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేయగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు కాకాణి పూజిత, తిరుపతి ఎంపీ గురుమూర్తి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం జయకుమార్‌రెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కాకాణిపై మరో కేసు నమోదు చేశారు.


