సంక్షోభంలో వ్యవసాయం | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో వ్యవసాయం

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

రైతులను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం

వెంకటగిరి సమన్వయకర్త

నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వాకాడు: రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంలో ఉందని, రైతులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయారని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వాకాడులోని స్వగృహంలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం ఆయన్ను కలిశారు. అలాగే రైతులు కలిసి తమ బాధలను వివరించారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లుగా పెరిగిన సేద్యపు ఖర్చులు, పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల దోపిడీ వంటి కారణాలతో రైతులు అప్పులపాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాలకులు ఇసుక, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు చేపట్టి లాభాలతో విర్రవీగుతూ ప్రజలను గాలికొదిలేశారన్నారు. త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈనెల 9వ తేదీన జరిగే దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వర్ధంతిపై స్థానికులతో ఆయన చర్చించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, వాకాడు, చిట్టమూరు మండలాల కన్వీనర్లు సుధాకర్‌నాయుడు, శ్రీనివాసులురెడ్డి, నాయకులు రాజారెడ్డి, నాగూర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పెంచలరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, రవి, శేషురెడ్డి, శ్రీహరిరెడ్డి, శిశికుమార్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement