సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం

May 16 2026 12:39 AM | Updated on May 16 2026 12:39 AM

నెల్లూరురూరల్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆయన శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్‌తో కలిసి ఉద్యోగుల గ్రీవెన్స్‌ డేను నిర్వహించారు. పలువురు ఉద్యోగులు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతినెలా మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్‌డేను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడ తెలిపిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ నాగరాజ కుమారి, మెప్మా పీడీ కిరణ్‌ కుమార్‌, బీసీ వెల్ఫేర్‌ అధికారి వెంకట లక్ష్మమ్మ, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ శోభారాణి, డీఎంహెచ్‌ఓ సుజాత, ఆర్టీసీ ఆర్‌ఎం షమీమ్‌, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement