ప్రజల హృదయాల్లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ప్రజల హృదయాల్లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి

May 10 2026 8:22 AM | Updated on May 10 2026 8:22 AM

వాకాడు: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం వాకాడులోని నేదురుమల్లి నివాసంలో నిర్వహించారు. జనార్దన్‌రెడ్డి చిత్రపటానికి ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నివాళి అర్పించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుంచి విచ్చేసిన పలువురు నాయకులు, కార్యకర్తలు నేదురుమల్లి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డితో ఉన్న అనుభవాలను పలువురు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, వాకాడు, చిట్టమూరు మండలాల కన్వీనర్లు సుధాకర్‌నాయుడు, శ్రీనివాసులురెడ్డి, నాగూర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పెంచల్‌రెడ్డి, వాకాటి రవి, వెంకటేశ్వర్‌రెడ్డి, మధురెడ్డి పాల్గొన్నారు.

కోట: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వర్ధంతిని శనివారం విద్యానగర్లోని ఎన్‌బీకేఆర్‌ ఐఎస్టీలో ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ 1979లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి విద్యానగర్‌లో ఎన్‌బీకేఆర్‌ ఐఎస్టీని ఏర్పాటు చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించారన్నారు. తండ్రి ఆశయాలను నేడు ఆయన తనయుడు, ఎన్‌బీకేఆర్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా జనార్దన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. రాజకీయాల్లో నేదురుమల్లి చెరగని ముద్రవేశారన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఓడీలు చింతా రవీంద్రారెడ్డి, నాగిరెడ్డి, శ్రీహరిరెడ్డి, హరనాథ్‌రెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement