రెడ్‌క్రాస్‌ పాలనలో స్వల్ప మార్పులు | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ పాలనలో స్వల్ప మార్పులు

May 18 2026 12:06 AM | Updated on May 18 2026 12:06 AM

నెల్లూరు(అర్బన్‌): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా కమిటీ పాలకవర్గం ఈనెల 14వ తేదీతో ముగిసింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో అదేరోజు డీఆర్వో విజయకుమార్‌ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు జరిగే వరకు రెడ్‌క్రాస్‌ కోశాధికారి, రెడ్‌క్రాస్‌ సెక్రటరీతో సమన్వయం చేసుకుంటూ ముగ్గురు కలిసి రోజు వారి విధులు నిర్వర్తించాలని డీఆర్వోని ఆదేశించారు. అయితే కలెక్టర్‌ ఉత్తర్వులపై రెడ్‌క్రాస్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, సీఈఓ ఏకే ఫరీదా రెడ్‌క్రాస్‌ పాలనలో స్పల్ప మార్పులు చేయాలని సూచించారు. కోశాధికారి కూడా రెడ్‌క్రాస్‌లో ఎన్నికై న పాలకవర్గ సభ్యుడు. ఆ సభ్యుడు పదవీకాలం ముగిసినందున బాధ్యతలు కూడా ముగిసినట్టేనని తెలిపారు. అందువల్ల స్పెషలాఫీసర్‌గా నియమితులైన డీఆర్వోతోపాటుసెక్రటరీగా పనిచేస్తున్న మస్తానయ్యకు మాత్రమే రోజువారీ వ్యవహారాలు నిర్వహించే అధికారాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లా శాఖ మేనేజింగ్‌ కమిటీ ఏర్పాటయ్యేవరకు రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖకు చెందిన బ్యాంక్‌ ఖాతాలను ఉమ్మడిగా నిర్వహించేందుకు వారిద్దరికీ మాత్రమే అనుమతించాలని కోరారు. దీంతో రెడ్‌క్రాస్‌లో మళ్లీ మార్పులు జరిగి ప్రత్యేకాధికారి, సెక్రటరీలు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.100

సన్నవి : రూ.40

పండ్లు : రూ.20

Advertisement
 
Advertisement
Advertisement