● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో బుధవారం నెల్లూరులోని తన నివాసంలో కోవూరు నియోజకవర్గానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉండి పార్టీ కార్యక్రమాలను చేరవేయాలన్నారు. బూత్ కమిటీల పనితీరును సమగ్రంగా సమీక్షించిన ఆయన, ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ప్రతి బూత్‌లో ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు చేయడం, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులపై అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా కృషి చేయాలన్నారు. యువత, మహిళలను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని, సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి, ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, బుచ్చి రూరల్ అధ్యక్షుడు చెర్లో సతీష్‌రెడ్డి, బుచ్చి మున్సిపాలిటీ అధ్యక్షుడు షేక్ షాహుల్, విడవలూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి నవీన్‌రెడ్డి, కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్‌రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీల ఇన్‌చార్జి కొండూరు లక్ష్మీనారాయణరెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనపల్లి ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


