నెల్లూరురూరల్: నగరంలో నూతనంగా ప్రారంభమైన ట్రాక్టర్‌ల షోరూమ్, అగస్త్య ఆగ్రోస్‌ను మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం సందర్శించి, సోలిస్, యన్మార్ ట్రాక్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాకాణి చేతుల మీదుగా రైతులకు ట్రాక్టర్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడంలో ఇలాంటి షోరూమ్‌ల పాత్ర కీలకమని, సోలీస్ సంస్థ విడుదల చేస్తున్న ట్రాక్టర్లు ఏసీ క్యాబిన్‌లతో సిద్ధమవుతుండడం ఆహ్వానించదగిన అంశమన్నారు. నిర్వాహకులు గుండాల వంశీకృష్ణారెడ్డి, యనమల నాగార్జునరెడ్డిలకు అభినందనలు తెలిపారు. డీలర్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ మా వద్ద 20 హార్స్ పవర్ నుంచి 120 హార్స్ పవర్ వరకు వాహనాలు లభ్యమవుతాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


