● ఎస్సై బెదిరించి కొట్టాడు
● బాధిత రైతు హరికృష్ణ
పొదలకూరు: ‘దైవ సాక్షిగా చెబుతున్నాను. విద్యు త్ ఏఈ శ్రీనివాసరావు నా వద్ద రూ.40 వేలు లంచం తీసుకున్నాడు. లంచం ఇస్తే కనెక్షన్ ఇస్తానని చెప్పడంతో ఆ మొత్తం ఇచ్చిన తర్వాత విద్యుత్ స్తంభాలు కూడా తోలారు. అయితే మా గ్రామంలో టీడీపీ నాయకులు మాకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ఆపించారు. నిమ్మ చెట్లు ఎండుతుంటే కడుపు మండి ఏఈను ఎందుకు కనెక్షన్ ఇవ్వరని ప్రశ్నించి, ఇవ్వకుంటే నేను ఇచ్చిన లంచం డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా అడిగాను. దీంతో ఏఈ ఎస్సై హనీఫ్‌కు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన నన్ను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పిలిపించి బెదిరించి ఇష్టానుసారం కొట్టాడు. ఆ సమయంలో మా గ్రామ టీడీపీ నాయకులకు వీడియో కాల్ చేసి నన్ను కొట్టే దృశ్యాలను ఎస్సై చూపించాడని అని బాధిత రైతు గాలం హరికృష్ణ వెల్లడించారు. రైతుగా తో టను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే కనెక్షన్ ఇవ్వకపోగా పోలీసులతో కొట్టించారని వాపోయాడు.


