అత్త హత్య కేసులో కోడలి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అత్త హత్య కేసులో కోడలి అరెస్ట్‌

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

సహకరించిన తల్లి కూడా..

వివరాలు వెల్లడించిన కావలి డీఎస్పీ

కావలి: దగదర్తి మండలం సున్నపుబట్టి గ్రామంలో మైపాటి మాధవి అనే మహిళను హత్య చేసిన కేసులో ఆమె కోడలు పద్మశ్రీని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కావలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ రమణకుమార్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పద్మశ్రీకి అదే గ్రామానికి చెందిన తన భర్త స్నేహితుడితో సన్నిహిత సంబంధం ఉంది. దీంతో అత్త మాధవి ఇలాంటి పనులు మానుకోవాలని కోడలు పద్మశ్రీకి చెప్పింది. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో కులపెద్దల వద్ద పంచాయితీ జరిగింది. వారు కూడా ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు. ఈక్రమంలో కోపోద్రిక్తురాలైన పద్మశ్రీ తన అత్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. మే 8వ తేదీ తన తల్లి పుచ్చలపల్లి మాధవి సహాయంతో ఇంట్లో నిద్రిస్తున్న అత్తపై దిండుపెట్టి గొంతు నులిమి హత్య చేసింది. యూట్యూబ్‌లో సీరియల్స్‌ చూసి ప్రజలు పక్కదోవ పడుతున్నారని, నేరాలు చేసిన వారు తప్పించుకునే అవకాశం లేదన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దన్నారు. రూరల్‌ సీఐ శివశంకర్‌, ఎస్సై జంపాని కుమార్‌, సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డులివ్వాలని ఉన్నతాధికారులకు సిఫార్స్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement