● ఈ ప్రాంతంతో ఆయనకు విడదీయలేని బంధం
● ప్రజల కోసం పరితపించిన దార్శనీకుడు
● మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: మాజీ సమితి అధ్యక్షుడు కాకాణి రమణారెడ్డి ప్రజల మనిషి అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గోవర్ధన్‌రెడ్డి తండ్రి రమణారెడ్డి ఐదో వర్ధంతిని పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో గురువారం నిర్వహించారు. ఘాట్ వద్ద కాకాణి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రమణారెడ్డికి ఈ ప్రాంతంతో విడదీయలేని బంధం ఉన్నట్లు చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పరితపించిన దార్శనికుడన్నారు. ఆయన నిబద్ధత వెలకట్టలేనిదని, ప్రజల కోసం ఆలోచించే గుణం తమకు ఎల్లవేళలా స్ఫూర్తిదాయకమన్నారు. కష్టకాలాన్ని అధిగమించేందుకు ఓర్పు, నేర్పుతోపాటు కష్టాలను ఎదుర్కొని తట్టుకునే మనో నిబ్బరాన్ని తండ్రి నుంచి నేర్చుకున్నట్టు పేర్కొన్నారు. ఆయన 18 ఏళ్లు సమితి ప్రెసిడెంట్‌గా రాజకీయాల్లో కొనసాగారన్నారు. రమణారెడ్డి చూపిన బాటలో పయనిస్తూ ప్రజాసేవలో ముందుకు వెళుతున్నామని, ఇదే ఆయనకు మేమిచ్చే ఘన నివాళిగా పేర్కొన్నారు. రమణారెడ్డి వర్ధంతి సందర్భంగా స్వచ్ఛందంగా తరలివచ్చిన ఆత్మీ యులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి, వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, నాయకులు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, వీరి చలపతిరావు, ఎం.వెంకటశేషయ్య, రావుల దశరథరామయ్య గౌడ్, దాసరి భాస్కర్‌గౌడ్, ఇంద్రసేన్‌గౌడ్, కేతు రామిరెడ్డి, ఏనుగు శశిధర్‌రెడ్డి, జి.లక్ష్మీకల్యాణి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, ఎస్‌కే అంజాద్, జి.వేణుగోపాల్‌రెడ్డి, కిషోర్, ఎ.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


