● స్టేట్ విజిలెన్స్ జాయింట్
కమిషనర్ డీసీకే నాయక్
పొదలకూరు : ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని స్టేట్ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ డీసీకే నాయక్ అన్నారు. పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి మందుల స్టాక్‌ను పరిశీలించారు. సీహెచ్‌సీలో రోగులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, కాన్పులు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీహెచ్‌సీలో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. సీహెచ్‌సీలో సర్జన్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. ప్రస్తుతం సీహెచ్‌సీని 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ చేసేందుకు సిఫార్సు చేస్తామన్నారు. 50 పడకల ఆస్పత్రిగా మార్చితే మరికొన్ని వైద్యనిపుణుల పోస్టులు మంజూరయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. సీహెచ్‌సీలోని వైద్యసేవలపై పూర్తి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఆయన వెంట డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పరిమళ, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్, వైద్యాధికారులు ఉన్నారు.


