అమరావతిలో నిర్మాణాలకు చేస్తున్న ఖర్చులో కొంత భాగం కేటాయిస్తే రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. జిల్లాలోని రైతాంగం పెన్నాపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం ఎంతైనా ఉంది. సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తయితే వేలాది హెక్టార్ల భూములు సాగులోకి వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టడంలేదు. సంగం బ్యారేజ్‌కు మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్న పేరును తీసేయడం బాధాకరం. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వం మెడలు వంచి ప్రాజెక్టులు సాధించుకుందాం.
–మేకపాటి విక్రమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే


