పెంచలకోనలో హనుమజ్జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

పెంచలకోనలో హనుమజ్జయంతి వేడుకలు

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అభిషేకం, పూలంగిసేవ, ఆకుపూజ చేశారు. సాయంత్రం తిరుచ్చిపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. కో న మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు.

బెల్ట్‌ షాపులపై

ఎకై ్సజ్‌ దాడులు

వరికుంటపాడు: మండల కేంద్రంలో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్న వారిపై ఎకై ్సజ్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్‌ సీఐ ఎస్‌కే అబ్దుల్‌ జలీల్‌ మాట్లాడుతూ పట్టుబడిన ఇద్దరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుర్తుతెలియని

వాహనం ఢీకొని..

యువకుడి దుర్మరణం

మనుబోలు: మండలంలోని మనుబోలు బైపాస్‌ రోడ్డు ఫ్లై ఓవర్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామానికి చెందిన కొత్తలూరు చంద్రశేఖర్‌ కుమారుడు కల్యాణ్‌ (22) మోటార్‌బైక్‌పై నెల్లూరులోని పెదనాన్న ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. మనుబోలు బైపాస్‌ రోడ్డు ఫ్లై ఓవర్‌ దిగుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు.

చికెన్‌ వ్యర్థాల

అక్రమ రవాణా

రెండు వాహనాల సీజ్‌

సంగం: చికెన్‌ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాలను మండలంలోని సంగం జాతీయ రహదారిపై పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకు న్నారు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మినీ లారీ, మరో వాహనంలో వ్యర్థాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాటిని సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు.

కుక్క దాడిలో

ముగ్గురికి గాయాలు

కోట: విద్యానగర్‌ మసీదు వీధిలో మంగళవారం నడిచి వెళ్తున్న ముగ్గురిపై కుక్క దాడి చేసింది. నవాజ్‌, మోహన్‌, లోకేశ్‌ అనే ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. బాధితులు కోట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందారు. కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement