జరిగింది ఇది.. | - | Sakshi
Sakshi News home page

జరిగింది ఇది..

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

జిల్లాలో ఖాకీల ‘పచ్చ’ కావరంతో అరాచకాలకు తెగబడుతున్నారు. పోలీస్‌ ప్రతిష్టను దిగజార్చుతూ పచ్చ పార్టీ నేతల కాళ్ల దగ్గర మోకరిల్లుతున్నారు. ‘పచ్చ’ ఉచ్చులో పడి పైశాచికంగా వ్యవహరించిన ఖాకీల మెడకు ఉచ్చు బిగిస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన గూడూరు రూరల్‌ పోలీసులు ఓ దళిత కుటుంబంపై అమానుషంగా విరుచుకు పడిన ఘటన నేపథ్యంలో హైకోర్టు చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఫ్లెక్సీ చించేశాడన్న అనుమానంతో అనుమానితుడు దొరకలేదని, అతని తండ్రిని స్టేషన్‌కు ఈడ్చుకెళ్లి లాఠీలతో చిత్ర హింసలకు గురి చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు జిల్లా ఎస్పీతోపాటు సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లు గురువారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్పష్టం చేయడంతో ఆ శాఖలో కలకలం రేపుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో కొందరు పోలీసులు పచ్చ పాలకుల పాదా క్రాంతమై.. రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రాజ్యాంగం అంటే గౌరవం.. న్యాయవ్యవస్థ అంటే భయమూ లేకుండా ఖాకీ దుస్తులు ధరించిన పచ్చ నేతల కిరాయిరౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతల అరాచకాలకు వంత పాడుతూ జీ హుజూర్‌ అంటున్నారు. ప్రజల హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. న్యాయాధికారుల చట్టబద్ధమైన ఆదేశాలను తుంగలో తొక్కేస్తూ.. అధికార పార్టీలోని గల్లీ స్థాయి వ్యక్తుల నోటి మాటలను శిరోధార్యంగా భావించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను, రైతులను, దళితులను ఈడ్చుకెళ్లి లాఠీలతో కుళ్లబొడుస్తున్నారు. ఇటీవల పొదలకూరులో ఎస్సై ఓ రైతును స్టేషన్‌లో ఉంచి చితకబాదుతూ వీడియో కాల్‌ చేసి తమ్ముళ్ల కళ్లల్లో ఆనందం చూసిన ఖాకీ ఉదంతం తెలిసింది. దీనికంటే ముందు గత నెల 18న గూడూరు రూరల్‌ పోలీసులు ఇదే తరహాలో ఓ దళితుడ్ని స్టేషన్‌లో నిర్బంధించి లాఠీలతో కుళ్లపొడవడంతో తీవ్ర గాయాలపాలైన విదితమే. ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసు కర్కశంపై బాధితుడి తరఫున వైఎస్సార్‌సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో జరిగిన పరిణామాలను పరిశీలించిన న్యాయస్థానం పోలీసుల దుశ్చర్యపై తీవ్ర స్థాయిలో తలంటడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గూడూరు రూరల్‌ సీఐ కిషోర్‌బాబు, ఎస్సై తిరుపతయ్యలతోపాటు కానిస్టేబుళ్లను స్వయంగా ఈ నెల 14న హైకోర్టుకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. దీంతో పాటు బాధితుడిని విచక్షణా రహితంగా కొట్టిన పోలీసులపై అట్రాసిటీ నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించడంతో ఆ శాఖలో కలవరం రేగింది.

పోలీసుల కర్కశత్వంపై.. హైకోర్టు సీరియస్‌

వైఎస్సార్‌సీపీ నేతల సహకారంతో పోలయ్య తనను కర్కశంగా హింసించిన కానిస్టేబుళ్లు, సీఐ, ఎస్సైపై ప్రైవేట్‌ కేసు నమోదు చేయాలని తన న్యాయవాది వి సురేందర్‌రెడ్డి ద్వారా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందున దీంతో హైకోర్టు ప్రైవేట్‌ కేసును ఆమోదించింది. పోలీసుల అరాచకంపై హైకోర్టు సీరియస్‌ అయింది. అధికార దుర్వినియోగంతో ఒక వ్యక్తిని చిత్ర హింసకు గురిచేశారన్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం చేసింది. ఈ దాష్టీకానికి బాధ్యత వహిస్తూ ఎస్పీ అజిత వెజేండ్లతోపాటు సీఐ, ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ నెల 14వ తేదీ కోర్టు ముందు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.

సీసీ ఫుటేజీలు అందజేయండి

గూడూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఘటన జరిగిన 2026 ఏప్రిల్‌ 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సీసీ కెమెరాల ఫుటేజీలను భద్ర పరచి హైకోర్టుకు అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పోలయ్య హైకోర్టులో వేసిన పిటిషన్‌లోని ప్రతివాదులుగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, జిల్లా ఎస్పీ, గూడూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ కిషోర్‌బాబు, ఎస్సై తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్‌, చిన్నలను కేసులో చేర్చారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఆదేశాలు జారీ చేశారు.

గతంలో ఇలా ఎన్నో .

గూడూరురూరల్‌ స్టేషన్‌ పరిధిలో ఇలా వైఎస్సార్‌సీపీ నాయకులు, మద్దతుదారులపై పలుమార్లు అక్రమ కేసులు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి. గతంలో కూడా విందూరులో అధికార పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అదే పార్టీకి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో చించేస్తే దానిని వైఎస్సార్‌సీపీ మద్దతుదారుకు ఆపాదించి గ్రామానికి చెందిన ఐదుగురిని స్టేషన్‌లో ఉంచి చితక బాదిన ఘటన ఉంది. ఈ ఘటనతో గూడూరురూరల్‌ పోలీసుల వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా కూడా వారిలో ఎలాంటి మార్పు చోటు చేసుకోకుండా ఓ దళితుడిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు స్పందించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గూడూరు రూరల్‌ పోలీసులకు

చట్టం చెంప దెబ్బ

ఫ్లెక్సీ చించేశారని లాకప్‌లో పెట్టి

దళితుడిని చితకబాదిన వైనం

పోలీస్‌ అరాచకంపై హైకోర్టుకెళ్లిన

వైఎస్సార్‌సీపీ నేతలు

ఈ నెల 14న జిల్లా ఎస్పీ, సీఐ,

ఎస్‌ఐలతోపాటు కానిస్టేబుళ్లు

స్వయంగా హాజరు కావాలని

హైకోర్టు ఆదేశాలు

పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోర్టు ఉత్తర్వులు

ఘటన జరిగిన రోజు సీసీ ఫుటేజీలు

అందజేయాలని స్పష్టీకరణ

గూడూరు మండలం మంగళపూరులో గత నెల (ఏప్రిల్‌) 1న స్థానిక ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు స్వాగతం పలుకుతూ అధికార పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మూడు రోజుల తర్వాత అవి చినిగిపోయాయి. దీనికి గ్రామ దళితవాడకు చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు గడుతోటి రవీంద్ర కారణమనే కేవలం అనుమానంతో టీడీపీ నేతలు గూడూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల ఫిర్యాదు కావడంతో పోలీసులు ఆగమేఘాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతోపాటు ఆ యువకుడిని అరెస్ట్‌ చేసేందుకు రంగంలోకి దిగారు. అయితే ఈ విషయంలో తనకెలాంటి సంబంధం లేకపోవడంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, కొడతారని భావించిన రవీంద్ర పరారీ అయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement