సీఆర్పీఎఫ్‌ ఏఎస్సైకు కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్‌ ఏఎస్సైకు కన్నీటి వీడ్కోలు

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

మర్రిపాడు: మండలంలోని సింగనపల్లి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్‌ ఏఎస్సై ఎన్‌.శేఖర్‌రెడ్డి గురువారం ఆకస్మికంగా మృతిచెందాడు. శుక్రవారం స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించి నివాళులర్పించారు. మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావుతోపాటు పలువురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. శేఖర్‌రెడ్డి పార్థివదేహానికి వైఎస్సార్‌సీపీ నాయకుడు గంగవరపు శ్రీనివాసులు నాయుడు, మండల యువత అధ్యక్షుడు చండ్ర నారాయణస్వామి, విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడు గంగినేని విజయ్‌కుమార్‌, స్థానిక నాయకులు గోపవరం కాశిరెడ్డి, కాసాల శ్రీను, బాలకృష్ణ, రసూల్‌ సాహెబ్‌, చల్లా వెంకటేశ్వర్లురెడ్డి, రేవూరు రామకృష్ణారెడ్డి, అయ్యవారయ్య నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement