● లారీ ఢీకొని కూలీ దుర్మరణం
నెల్లూరు సిటీ: ఓ వ్యక్తి కూలీ పని ముగించుకుని మోటార్‌బైక్‌పై జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఇందుకూరుపేట మండలం జంగాల దొరువుకు చెందిన జి.వెంకటరమణయ్య (53) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం నెల్లూరుకు వస్తుంటాడు. అతడికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో బుధవారం నెల్లూరులోని భగత్‌సింగ్ కాలనీలో పనికి వచ్చాడు. పూర్తయ్యాక బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. కాలనీలో నుంచి జాతీయ రహదారి దాటుతుండగా నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వెంకటమరణయ్యను ఢీకొట్టింది. కొంతదూరం అతడిని ఈడ్చుకెళ్లింది. దీంతో నుజ్జునుజ్జయ్యాడు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. లారీ డ్రైవర్ అక్కడ్నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు.


