సూపర్ హిట్ కాంబో.. ఆ డైరెక్టర్‌తో మరోసారి నిహారిక! | Niharika Konidela committee Kurrollu Combo Repeat again | Sakshi
Sakshi News home page

Niharika Konidela: సూపర్ హిట్ కాంబో.. మరోసారి రిపీట్ కానుందా?

Oct 8 2025 9:24 PM | Updated on Oct 8 2025 9:24 PM

Niharika Konidela committee Kurrollu Combo Repeat again

గ‌తేడాది చిన్న చిత్రంగా వచ్చిన సూపర్ హిట్గా నిలిచిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. మూవీని మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. గోదావరి బ్యాక్డ్రాప్లో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు.  రూ.9 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రిక‌ల్‌గా రూ.24.5 కోట్లు వ‌సూళ్ల‌ు రాబట్టింది.

మరోసారి రిపీట్.. 

అయితే మరోసారి కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. యంగ్ డైరెక్ట‌ర్ య‌దు వంశీ మ‌రోసారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెలతో క‌లిసి మ‌రో సినిమాను రూపొందించ‌టానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్ల‌నుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇక కమిటీ కుర్రోళ్లు సినిమా అవార్డుల రేసులో స‌త్తా చాటింది. సైమా 2025లోబెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్గా సందీప్ సరోజ్‌కి సైమా అవార్డు వచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెల్చుకుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అలాగే డైరెక్టర్ యదు వంశీ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డును సొంతం చేసుకున్నారు.

ప్రొడక్షన్ నెం.2..

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఫాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement