
కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వా వాత్తియార్’ విడుదల తేదీ ఖరారు అయింది. డిసెంబరు 5న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. నలన్ కుమారస్వామి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ‘‘కార్తీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ‘వా వాత్తియార్’ పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కార్తీ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందనే అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.