
టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి తమ్ముడు, హీరో మంచు మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో నువ్వే నాకు ఎల్లప్పుడు ఆదర్శం అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఒక తల్లిగా, నటుడిగా, నిర్మాతగా నువ్వు జీవిస్తున్న విధానం అద్భుతం అంటూ కొనియాడారు. నువ్వు అడుగుపెట్టే ప్రతి ఇంటికి వెలుగునిచ్చి.. నీ దయ, బలంతో ఎన్నో జీవితాలను మార్చేశావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు.
ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే ఉండి.. నువ్వు వెళ్లే ప్రతిచోటా నీ వెలుగును ప్రకాశింపజేస్తూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మంచు మనోజ్ ఎమోషనలయ్యారు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్కా ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు లక్ష్మీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది భైరవం, మిరాయ్ చిత్రాలతో అలరించాడు. ఇటీవలే విడుదలైన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.
Wishing my sister and my everything, @LakshmiManchu akka, a very happy birthday ❤️
You’ve always been my biggest inspiration, akka. The way you handle life as a mother, actor, producer, and a person with such a big heart is just incredible.
You light up every room you walk into… pic.twitter.com/aKNF6Qme5n— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 8, 2025