ఘట్టమనేని వారసుడి ఫస్ట్‌ సినిమా.. హీరోయిన్‌ను ప్రకటించిన మేకర్స్‌ | Rasha Thadani Debuts in Telugu Cinema Opposite Jayakrishna Ghattamaneni | Sakshi
Sakshi News home page

ఘట్టమనేని వారసుడి ఫస్ట్‌ సినిమా.. హీరోయిన్‌ను ప్రకటించిన మేకర్స్‌

Nov 17 2025 1:40 PM | Updated on Nov 17 2025 1:47 PM

Rasha thadani movie confirmed With Ghattamaneni jayakrishna

ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ( ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు)కు జోడీగా  బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా టాండానీ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం’ చిత్రాల దర్శకుడు ‌ అజయ్‌ భూపతి  ఈ ప్రాజెక్ట్‌ గురించి కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా హీరోయిన్‌ పోస్టర్‌ను ఆయన షేర్‌ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌తో అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.

బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌  చిత్రం ‘అజాద్‌’లో ఓ కీలకపాత్రలో నటించి, మెప్పించిన రాషా టాండన్‌ ఇప్పుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఎమోషనల్ లవ్ స్టోరీతో అజయ్‌ భూపతి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. జయకృష్ణ, రషా టాండన్‌ కాంబినేషన్‌ వెండితెరపై ఎలా ఉంటుందో చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement