రెండోసారి కౌన్సిలర్లుగా దంపతులు
బోధన్‌రూరల్: బోధన్ మున్సిపాలిటీలో తూము పద్మ, తూము శరత్ రెడ్డి దంపతులు రెండోసారి కౌన్సిలర్లుగా గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి మున్సిపాలిటీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) తరఫున తూము పద్మ (25వ వార్డు), తూము శరత్ రెడ్డి (35వ వార్డు) గెలుపొందారు. అప్పుడు మున్సిపల్ చైర్మన్ స్థానం మహిళకు రిజర్వు అవ్వడంతో తూము పద్మ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2024 అస్లెంబీ ఎన్నికలకు ముందు భార్యాభర్తలిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దంపతులు విజయం సాధించారు. చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో తూము శరత్‌రెడ్డి రేసులో ఉన్నారు.


