నవీపేట: మండలంలోని తుంగిని గోదావరి నది తీరాన ఉన్న పుష్కర ఘాట్‌ను కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య శుక్రవారం సాయంత్రం సందర్శించారు. గతంలో నిర్మించిన పుష్కర ఘాట్ పూర్తిగా మట్టితో పేరుకుపోవడాన్ని పరిశీలించారు. గతంలో కన్నా ఈసారి ఎక్కువగా భక్తుల తాకిడి పెరుగుతుందని, ఏర్పాట్లు అదనంగా చేపట్టాలని అభిప్రాయపడ్డారు. రోడ్డు సౌకర్యం ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నారు. సీపీ వెంట నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, సర్పంచ్ బీర్కూర్ కాంతారావ్, ఉప సర్పంచ్ భూమేశ్ తదితరులు ఉన్నారు.


