● కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు
● మద్యం, నిద్ర మత్తుతోనే యాక్సిడెంట్లు
● జరిమానా విధించినా
తీరు మార్చుకోని వాహనదారులు
నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలో వరుస రోడ్డు ప్రమా దాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్న ప్రమాదంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయితే, రోడ్డు ప్రమాదాలకు మద్యం మత్తులో వాహనాలు నడపటం, రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయటం వంటివి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
తరచూ ప్రమాదాలు..
జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బ్లాక్ స్పాట్ ప్రాంతాలే కాకుండా జిల్లా రోడ్లు, గ్రామీణ ప్రాంత రోడ్లపై సైతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో వాహనదారుల నిర్లక్ష్య వైఖరి ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల రుద్రూర్ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. డిచ్‌పల్లి వద్ద జాతీయ ర హదారిపై ప్రయివేటు బస్సు బోల్తా పడటంతో న లుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. తాజాగా శుక్రవారం బడాపహాడ్ వద్ద బ స్సు బోల్తా పడటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా అనేక ప్రాంతాలలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలోని జాతీయ రహదారి వెంబడి డిచ్‌పల్లి సీఎంసీ వద్ద, ఇందల్వా యి మండలం గన్నారం, ఆర్మూర్ పట్టణంలోని పె ర్కిట్, బాల్కొండ చిట్టాపూర్ , జక్రాన్‌పల్లి మండ లం పడకల్ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటితో పాటు బోధన్–నిజా మాబాద్, నిజామాబాద్ –నందిపేట్, నిజామాబాద్–మల్లారం గండి, నిజామాబాద్–ఆర్మూర్ రహ దారుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండలి. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. సెల్‌ఫోన్ డ్రైవింగ్ మానుకోవాలి. మద్యం సేవించి వాహనం నడుపొద్దు. భద్రతను దృష్టిలో పెట్టుకొని వాహనాలను నెమ్మదిగా నడపాలి.
– మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఏసీపీ
కనిపించని మార్పు..
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీసీ, పోలీ స్ శాఖ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లకు ఆరు నెలలకు ఒకసారి డ్రైవింగ్ నిబంధనలు ట్రా ఫిక్ నిబంధనలను తెలియజేస్తున్నారు. వీటితోపా టు ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు ని ర్వహిస్తున్నారు. రోడ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహి స్తూ హెల్మెట్ ధరించేలా వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నా మార్పు కనిపించడం లేదు.
ఈ ఏడాది మార్చి నెల వరకు జిల్లాలో 31 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 28 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. గతేడాది జిల్లాలో 780 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 276 మంది మృతి చెందగా, 715 మంది గాయపడ్డారు. జిల్లాలోని జాతీయ రహదారుల వెంబడి సుమారు 223 ప్రమాదాలు చోటుచేసుకోగా 293 మంది ప్రాణాలు కోల్పోయారు.
కారణాలివే..
రోడ్డు ప్రమాదాలకు మూల కారణం నిర్లక్ష్య వైఖరితోపాటు మద్యం, మత్తు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించకుండా వాహనాలకు వ్యతిరేక దిశలో వెళ్లడం.
వాహనాల ఓవర్ టేక్ చేసే సమయంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
జాతీయ రహదారులపైకి వాహనాలతో నేరుగా దూసుకురావడం
విందు లేదా శుభకార్యాలకు హాజరై మద్యం సేవించి వాహనాలు నడపటం.
సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపటం.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్
ధరించకపోవటం.


