9 | - | Sakshi
Sakshi News home page

9

Apr 4 2026 9:49 AM | Updated on Apr 4 2026 9:49 AM

276 మిల్లులకు ధాన్యం.. అందుబాటులో గన్నీబ్యాగులు

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
లక్ష్యం@

క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న..

క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ పోటీలను నిర్వహించిందని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.

శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

– 8లో u

లక్షల

ధాన్యం సేకరణకు 669 కొనుగోలు కేంద్రాలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ప్రస్తుత యాసంగి సీ జన్‌కు సంబంధించి జిల్లాలో 9 లక్షల మెట్రిక్‌ ట న్నుల బియ్యం సేకరించేందుకు పౌర సరఫరాల శా ఖ రంగం సిద్ధం చేసింది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,27,825 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. సాధారణ సాగు 3,92,408 ఎకరాల కంటే ఇది ఎక్కువ. ప్రస్తుతం సాగు చేస్తున్న వరిలో అత్యధికంగా సన్నరకం 3,67,991 ఎకరాలు ఉండగా, దొడ్డు రకం 59,834 ఎకరాలు మాత్రమే ఉంది.

● ఎకరానికి సగటున 2.785 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని, కాగా సన్నధాన్యం ఎకరానికి 2.774 మెట్రిక్‌ టన్నులు, దొడ్డు ధాన్యం ఎకరానికి 2.860 మెట్రిక్‌ టన్నులు వస్తుందని అధికారులు లెక్కలు వేశారు.

● ఇందుకు సంబంధించి సన్నధాన్యం 10,20,691 మెట్రిక్‌ టన్నులు, దొడ్డు ధాన్యం 1,71,145 మెట్రిక్‌ టన్నులు మొత్తం 11,91,836 మెట్రిక్‌ టన్నులు ది గుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 9 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సన్నధాన్యం 7,28,855 మెట్రిక్‌ టన్నులు, దొడ్డు ధాన్యం 1,71,145 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

జిల్లాలో 64 పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు, 212 రా రైస్‌ మిల్లులకు ధాన్యం ఇవ్వనున్నారు. మొత్తం 276 మిల్లులకు సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం ఇవ్వనున్నారు. పారా బాయిల్డ్‌ మిల్లుల సామర్థ్యం 4 లక్షల మెట్రిక్‌ టన్నులు, రా రైస్‌ మిల్లులకు 5,59,000 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. ఇంకా 6 లక్షల మెట్రిక్‌ టన్నులు మిల్లర్ల వద్ద ఉంది. దీంతో సేకరించిన ధాన్యం నిల్వ చేసేందుకు నెలకొన్న సమస్య అధిగమించేందుకు ఈ నెలలో రేషన్‌ కోటా కింద ఇచ్చే బియ్యాన్ని ఒకేసారి మూడు నెలలకు ఇవ్వనున్నారు. ఇలా మూడు నెలల బియ్యం రేషన్‌ కార్డుదారులకు ఇస్తే గోదాముల్లో 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ఖాళీ ఏర్పడుతుంది. గోదాములు చాలకపోతే ఇతర జిల్లాల గోదాములను సైతం వాడుకునేందుకు పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ధాన్యం సేకరణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ పోరాటంలో కొమరయ్య పాత్ర కీలకం

అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌

ధాన్యం సేకరణ కోసం జిల్లాలో 669 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కేంద్రాలు 408 ఉన్నాయి. ఐకేపీ ద్వారా 224 కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా 24 కేంద్రాలు, ఇతర విభాగాల ద్వారా మరో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తగి న ఏర్పాట్లు చేశారు. అయితే, ధాన్యం సేకరణకు సంబంధించి 2.25 కోట్ల గన్నీ బ్యాగులు అవస రం కాగా, ప్రస్తుతం 72,74,264 బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 1,52,25,736 గన్నీ బ్యాగులు సమకూర్చాల్సి ఉంది.

క్రీడాకారులకు కలెక్టర్‌

ఇలా త్రిపాఠి పిలుపు

సీఎం కప్‌ విజేతలకు అభినందన సభ

అంతర్జాతీయ క్రీడాకారులు సౌమ్య, హుస్సాముద్దీన్‌లకు సత్కారం

సన్నధాన్యం 7,28,855 మె.ట,

దొడ్డు ధాన్యం 1,71,145 మె.ట.

ఈ నెలలోనే ఒకేసారి 3 నెలల

రేషన్‌ బియ్యం

గోదాములు ఖాళీ అయితే సేకరించిన ధాన్యం సర్దుబాటుకు ప్రణాళికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement