● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
నవీపేట: మండలంలోని యంచ శివారులోని గోదా వరి నది ఒడ్డున పుష్కర ఘాట్ మంజూరుకు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నా రు. నిర్మల్ జిల్లా బాసరలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్లారు. పుష్కర ఘాటు ఏర్పాటు చేయాల ని ఇటీవల యంచ గ్రామస్తులు ఆయనను కలవడంతో మార్గమధ్యలో యంచ తీరాన్ని పరిశీలించారు. వచ్చే ఏడాది దక్షిణ భారతదేశంలో నిర్వహించే గో దావరి పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో ఘాట్‌లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. యంచ తీరంలో ప్రశాంత వాతావరణం ఉందని, పుష్కర ఘాటు ఏర్పాటుకు అను కూలంగా ఉందన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి పుష్కర ఘాటు మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ అఽ ద్యక్షుడు నగేశ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ రాజేందర్‌గౌడ్, ధర్మాజీ ఉన్నారు.


