పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు

పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

పలు గ్రామాల్లో

అభివృద్ధి పనుల ప్రారంభం

రుద్రూర్‌: బాన్సువాడ నియోజక వర్గంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం, ముదిరాజ్‌ ఫంక్షన్‌హాల్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తపల్లి ముదిరాజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో టాయిలెట్స్‌ నిర్మాణానికి రూ. ఐదు లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇప్పటికే 11వేల ఇళ్లు నిర్మించి దేశంలోనే ఆదర్శంగా నిలిచినట్టు పేర్కొన్నారు. మిగిలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. గ్రామాల్లో అభివృద్ధికి అందరు ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పోతంగల్‌ మండల కేంద్రంతోపాటు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌, నిజామాబాద్‌ నగర మేయర్‌ ఉమారాణి, ఏఎంసీ చైర్మన్‌ హన్మంతు, తహసీల్దార్‌ గంగాధర్‌, డిప్యూటి డీఎంహెచ్‌వో సమత, జిల్లా ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు కరాటే రమేష్‌, ముదిరాజ్‌ సంఘ నాయకులు నీరడి గంగాధర్‌, బీమా సాయరెడ్డి, కప్ప గణేష్‌, సుదర్శన్‌, సర్పంచ్‌లు గంగారాం, సంధ్య, విండో ఇన్‌చార్జిలు రియాజుద్దీన్‌, పుష్ప, ఏవోలు నిశిత, రాజు, ఎంపీడీవో చందర్‌, ఎంఆర్‌ఐ సయ్యద్‌ హుస్సేన్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement