● రోడ్డు ప్రమాదంతో ఏళ్లుగా
మంచానికే పరిమితమైన భర్త
● కూలి పని చేస్తూ కుటుంబాన్ని
పోషించుకుంటున్న భార్య
● ఉదార స్వభావులు సాయం
చేయాలంటూ వేడుకోలు
మాక్లూర్: కుటుంబ పెద్దదిక్కయిన భ ర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితం కావడంతో ఆ కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో భార్యనే కుటుంబానికి పెద్దదిక్కుగా మారి కూలి పని, బీడీలు చుడుతూ రాత్రింబవళ్లు కష్టపడుతోంది. వచ్చిన చాలీచాలని డబ్బులు తన భర్త చికిత్సకు, ముగ్గురు ఆడపిల్లల పోషణకు ఏమా త్రం చాలకపోవడంతో ఆ పేద కుటుంబం ఏళ్లు గా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వివరాలు ఇలా.. మండలంలోని ధర్మోరా గ్రా మానికి చెందిన హన్మాండ్లుకు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హన్మాండ్లు సౌదీ దేశానికి వెళ్లగా, నెలరోజులకే అక్కడ రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. అతడు కోమాలోకి వెళ్లగా అక్కడి కంపెనీ స్వదేశానికి పంపించేసింది. అతడి భార్య ఎకరం భూ మిని విక్రయించి చికిత్స చే యించింది. అయినా డబ్బు లు సరిపోక సుమారు రూ.8 లక్షల వరకు అప్పులు చేసింది. అయినా అతడి రెండు కాళ్లు పని చేయక, వెన్నుపూ స విరిగి, ఒక కిడ్ని చెడిపో యి జీవచ్చవంలా 11ఏళ్లుగా మంచానికే పరిమి తమయ్యాడు. అతడి నెలవారి మందులకు రూ: 8వేలు కావాల్సి ఉంటుంది. భార్య కవిత మా త్రం ఆత్మస్థైర్యం వీడకుండా కూలిపని, బీడీలు చుడుతూ చాలీచాలని డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. దీంతో ఇటీవల బతుకు భారమై తన కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అలిసిపోయింది. ఉధార స్వభావులు ఎవరైన ముందుకు వచ్చి ఆదుకుంటారేమోనని ఎదురు చూస్తోంది. సా యం చేయదలచిన దాతలు 91001 92092కు ఫోన్‌పే చేయాలని ఆమె వేడుకుంటున్నారు.


