ఖలీల్‌వాడి: దేశ భవిష్యత్ కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బాబూ జగ్జీవన్‌రామ్ అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అర్బన్ ఎ మ్మెల్యే ధన్‌పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భా రత మాజీ ఉపప్రధాని జగ్జీవన్ రామ్ జయంతిని జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే, కలెక్టర్‌తోపాటు నగర మేయ ర్ ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గు గంగాధర్, ఆర్డీవో రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని వక్తులు అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ, వారిలో స్ఫూర్తిని నింపేందు కు ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతుల ను అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. మహనీయుల జీవిత విశేషాలను తెలుసుకొని, వా రి అడుగుజాడల్లో పయనించాలని యువతకు పిలుపునిచ్చారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి రాజ్ గంగారాం, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, ఆయా సంఘాల ప్రతినిధులు పా ల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన ప్రముఖ దళిత నేత సిద్ధిరాములును స్మరిస్తూ, రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
మహనీయుల గొప్పతనాన్ని
భావితరాలకు తెలపాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్,
కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి


