భీమ్‌గల్‌లో యువకుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

భీమ్‌గల్‌లో యువకుడి అదృశ్యం

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

భీమ్‌గల్‌లో యువకుడి అదృశ్యం

భీమ్‌గల్‌లో యువకుడి అదృశ్యం

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ మండలం మెండోర గ్రామానికి చెందిన షేక్‌ మునీర్‌(25) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై తిరుపతి బుధవారం తెలిపారు. ఈనెల 16న నిజామాబాద్‌లో పని ఉందని ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

కోటగిరిలో వివాహిత..

రుద్రూర్‌: కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై సునీల్‌ బుధవారం తెలిపారు. ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇందల్వాయిలో..

ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై బుధవారం తెలిపారు. మతిస్థిమితం సరిగా లేని ఆమె ఈ నెల 17న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement