‘ఇందూరు’పై కాషాయ జెండా ఎగరడం ఖాయం | - | Sakshi
Sakshi News home page

‘ఇందూరు’పై కాషాయ జెండా ఎగరడం ఖాయం

Feb 13 2026 5:23 AM | Updated on Feb 13 2026 5:23 AM

‘ఇందూరు’పై కాషాయ జెండా ఎగరడం ఖాయం

‘ఇందూరు’పై కాషాయ జెండా ఎగరడం ఖాయం

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌

సుభాష్‌నగర్‌: ఇందూరు మున్సిపల్‌ ఎన్నికల్లో బీజే పీ అఖండ విజయం సాధించి మేయర్‌ పీఠాన్ని కై వ సం చేసుకోవడం ఖాయమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారి అధ్యక్షతన ము న్సిపల్‌ ఎన్నికల అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లతో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడు తూ మన ఇందూరు – మన మేయర్‌ నినాదానికి ప్రజలు మద్దతు పలికారని తెలిపారు. పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే ప్రజల నాడి పూర్తిగా బీజేపీ వైపే ఉందని స్పష్టమవుతోందన్నారు. కార్యకర్తల కష్టానికి తగిన ఫలితం దక్కబోతోందని, నేడు వెలువడే ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందని తెలిపారు. ఓట్లు లెక్కించే సమయంలో ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలని ఏజెంట్లకు సూచించారు. తేడా అనిపిస్తే, వెంటనే ‘రీ–కౌంటింగ్‌’ కోరాలని, కౌంటింగ్‌ ప్రక్రియపై అభ్యర్థులకు, కౌంటింగ్‌ ఏజెంట్లకు దిశానిర్దేశంచేశారు. సమావేశంలో నాయకులు, అభ్యర్థులు కందగట్ల రాంచందర్‌, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్‌ కుమార్‌, తిరుపతిరెడ్డి, బద్దం కిషన్‌, బంటు రాము, పుట్ట వీరేందర్‌, శ్రీకాంత్‌, ఏజెంట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement