యూరియా కోసం రైతుల ధర్నా
నందిపేట్ (ఆర్మూర్): పాత పద్ధతిలోనే యూరి యా సరఫరా చేయాలని, కొత్తగా తీసుకొచ్చిన యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నందిపేట మండల కేంద్రంలో రైతులు శుక్రవారం ధ ర్నా నిర్వహించారు. వివేకానంద చౌరాస్తా వద్ద చింరాజ్‌పల్లి సొసైటీ పరిధిలోని తల్వేద, చింరాజ్‌పల్లి, నందిపేట, బజార్‌కొత్తూర్ గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించారు. యాప్ ద్వారా యూరి యా బుకింగ్ చేసేందుకు తమ వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామ ని రైతులు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన రీ తిలో యూరియా సరఫరా చేయడం లేదని విమర్శించారు. ఎస్సై రాము ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు.


