నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్: నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా వై ద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ అ ధ్యక్షతన ఐడీవోసీలో గర్భస్త, పూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రమాణా లు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాలు రికార్డులను, రిపోర్టులను క్ర మం తప్పకుండా నమోదు చేయాలని ఆదేశించా రు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, పీవోలు సుప్రియ, శిఖర, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు అశ్వినీ, సమత, రెడ్‌క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు పాల్గొన్నారు.


