ప్రజల ఆలోచన మేరకే కాంగ్రెస్‌ పాలన.. | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆలోచన మేరకే కాంగ్రెస్‌ పాలన..

Feb 21 2026 8:02 AM | Updated on Feb 21 2026 8:02 AM

ప్రజల ఆలోచన మేరకే కాంగ్రెస్‌ పాలన..

ప్రజల ఆలోచన మేరకే కాంగ్రెస్‌ పాలన..

ప్రజల ఆలోచన మేరకే కాంగ్రెస్‌ పాలన కొనసాగుతుందని రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా మేయర్‌ పనిచేయాలని సూచించారు. రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మేయర్‌గా బీసీ బిడ్డకు బాధ్యతలు అప్పగించామని, అభివృద్ధిలో కాంగ్రెస్‌ మార్క్‌ కచ్చితంగా చూయిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం త్వ రలోనే సబ్‌ కమిటీ వేసి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం జైలుకు వెళ్లిన వారు, కేసులు ఎదుర్కొంటున్న వారు, ప్రాణాలు అర్పించిన వారందరికీ నివాళ్లర్పిస్తూ.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మంత్రి చెప్పారు. దేశంలోనే అత్యంత చిన్న వయస్సు కలిగిన రాష్ట్రమైనప్పటికీ 2047 విజన్‌ పేరుతో అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచిందని, బీజేపీ ఇప్పటికై నా రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షను విడనాడాలని విజ్ఞప్తి చేశారు.

మేయర్‌ ఉమారాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement