సరికొత్త అధ్యాయం | - | Sakshi
Sakshi News home page

సరికొత్త అధ్యాయం

Feb 21 2026 8:02 AM | Updated on Feb 21 2026 8:02 AM

సరికొత్త అధ్యాయం

సరికొత్త అధ్యాయం

నగర పాలనలో

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగర పాలక సంస్థ లో సరికొత్త అధ్యాయం మొదలైందని, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మేయర్‌ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. మేయర్‌గా ఉమారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం కార్పొరేషన్‌లోని మేయర్‌ ఛాంబర్‌లో ఘనంగా నిర్వహించారు. అనంతరం మేయర్‌ మాట్లాడుతూ నగరంలో ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చేలా చర్యలు చేపడుతామన్నారు.

పార్టీలకు అతీతంగా అందరి సలహాలు, సూచనలతో నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. తనపై నమ్మకముంచి మేయర్‌ పదవి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యఅతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన మేయర్‌ ఉమారాణి, డిప్యూటీ మేయర్‌ సల్మా తహసీన్‌ను వారు అభినందించారు.

అవినీతి రహిత పాలనే లక్ష్యం..

కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తాం..

రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధుల

సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొస్తాం

మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన

కూరగాయల ఉమారాణి

వెలుగులు నింపే మార్పు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement