ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించాలి

Feb 21 2026 8:02 AM | Updated on Feb 21 2026 8:02 AM

ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించాలి

ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించాలి

డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ శ్రీ

సుభాష్‌నగర్‌: ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించేలా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో బి రాజ శ్రీ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐ దేళ్లలోపు చిన్నారుల మరణాలపై డీఎంహెచ్‌వో కా ర్యాలయంలో ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించా రు. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, మెడికల్‌ నాలెడ్జ్‌ను పెంచుకుంటూ వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో సూచించారు. సీ్త్రలు, చిన్న పిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలని, బా లింతలను క్రమం తప్పకుండా ఇంటి వద్ద పర్య వేక్షించాలన్నారు. సీపీఆర్‌పై అందరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతి గర్భిణి, ప్రతి బాలింతను పర్యవేక్షించి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలన్నారు. ప్రథమ చికిత్స, ఎమర్జెన్సీ కిట్‌ అందరి వద్ద అందుబాటులో ఉండాలన్నారు. బిడ్డకు, బిడ్డకు మ ధ్య వ్యత్యాసం పాటించేలా అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. శాశ్వత, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై కౌన్సెలింగ్‌ చేయాలన్నా రు. విధుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రాణాలను కాపాడే బాధ్యత అందరిపై ఉంద న్నారు. పిల్లల వైద్య నిపుణులు శ్రీకాంత్‌, నవీన్‌ మాట్లాడుతూ చిన్నపిల్లలు ప్రతిరోజు కనీసం 20 గ్రాముల బరువు పెరగాలన్నారు. సరిపడా నిద్ర లే కపోయినా, పాలు తాగకపోయినా, మూత్రం చేయకపోయినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. సీ్త్ర వైద్య నిపుణులు నిషాద్‌, అశ్విని మా ట్లాడుతూ గర్భిణులకు సీబీపీ, హిమోగ్లోబిన్‌, బీపీ రికార్డు, ఎత్తు, బరువు పరీక్షించాలని తెలిపారు. సమావేశంలో డీఐవో ఎం అశోక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు అశ్వినీ, సమత, పీవోఎంసీహెచ్‌ శ్వేత, సీడీపీవోలు, డీహెచ్‌ఈలు ఘన్‌పూర్‌ వెంకటేశ్వర్లు, మనోహర్‌, మెడికల్‌ ఆఫీసర్లు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement