క్రైం కార్నర్
మహిళ మృతదేహం లభ్యం
నవీపేట: మండలంలోని గోదావరి నదిలో శుక్రవారం మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతురాలిని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కర్కేలీకి చెందిన అనుసూయ దిలీప్ మోతెవాడ్(23)గా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం సాయంత్రం గోదావరి నది సమీపంలో స్థానికులకు కనిపించిన అనుసూయ గోదావరి నదిలో దూకిందన్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు.
నస్రుల్లాబాద్: మండలంలోని మైలారం శివారులో ఉన్న కాలువలో గుర్తు తెలియని మహిళ(40–50) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రాఘవేంద్ర శుక్రవారం తెలిపారు. జీపీ సిబ్బందితో మృతదేహాన్ని బయటకు తీయించినట్లు పేర్కొన్నారు. మృతురాలిపై లేత నీలం రంగు చీర, నలుపు రంగు జాకెట్టు ధరించి ఉందని, కుడి చేతిపై అంజవ్వ అని ఉందన్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
క్రైం కార్నర్


