బాన్సువాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

బాన్సువాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Feb 21 2026 7:08 AM | Updated on Feb 21 2026 7:08 AM

బాన్స

బాన్సువాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య భారీ స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పట్టణంలోని ఓ మార్టులో ఓ వర్గానికి చెందిన పాటలను పెట్ట డంతో మరో వర్గానికి చెందిన వ్యక్తి ఆ పాటలు ఎందుకు పెట్టారని, అక్కడున్న ఓ బాలికతో గొడవకు దిగి, బాలిక వీడియోలు, ఫొటోలు తీయడంతో మార్టు సిబ్బంది ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం తెలుసుకున్న మరో వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషన్‌కు రావడంతో ఇంకో వర్గం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓ వర్గం రాజీవ్‌ చౌరస్తా వద్ద ఉంటే మరో వర్గం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ ముందు గుమ్మిగుడారు. అక్కడికి చేరుకున్న బాన్సువాడ, ఎల్లారెడ్డి డీఎస్పీలు విఠల్‌రెడ్డి, శ్రీనివాస్‌రావులు ఆందోళనలు చేస్తున్న వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఎవరూ వినకపోవడంతో పరిస్థితి చేయి దాటుతుందని జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఇరువర్గాల వారు రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు, బైక్‌లను ధ్వంసం చేశారు. దుకాణాల అద్దాలు పగులగొట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్ర భారీ బలగాలతో వచ్చి ఆందోళన కారులను తరమివేశారు. సుమారు 5 గంటల పాటు బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనలన వీడియో లు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చా రు. ఘటనలో ఓ కానిస్టేబుల్‌ కాలికి గాయమైంది.

లాఠీఛార్జ్‌ అమానుషం..

బాన్సువాడలోని ఓ మార్టులో ఒక బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వర్గం వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా మరో వర్గంపై లాఠీచార్జ్‌ చేయడం అమానుషం అని బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ అన్నారు. షాపింగ్‌మార్టును ధ్వంసం చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.

ఐదు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం

భారీగా మోహరించిన పోలీసు బలగాలు

రాళ్ల వర్షం కురిపించిన

ఆందోళన కారులు

దుకాణాలు, బైకులు ధ్వంసం

బాన్సువాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ 1
1/2

బాన్సువాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

బాన్సువాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ 2
2/2

బాన్సువాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement